పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా.. 13 మంది మృతి | 13 dead as tractor overturns in Madhya Pradesh's Rajgarh | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా.. 13 మంది మృతి

Published Mon, Jun 3 2024 7:15 AM | Last Updated on Mon, Jun 3 2024 9:00 AM

13 dead as tractor overturns in Madhya Pradesh's Rajgarh

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ బోల్తా పడిన ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. అందులో నలుగు చిన్నారులు ఉన్నారు. ఆదివారం రాత్రి  8 గంటల సమయంలో రాజగఢ్‌ పిప్లోడి  వద్ద  ఓ వివాహ ఊరేగింపులో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన మరో 15 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలానికి చేరకుని పరిశీలించారు. రాజస్థాన్‌లోని మోతీపురా నుంచి కులంపూర్‌కు ఊరేగింపుగా వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందినవారిలో రాజస్థాన్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ స్పందించారు. ‘‘రాజస్థాన్‌  ప్రభుత్వం, పోలీసులతో టచ్‌లో ఉ‍న్నాం. రాజస్తాన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరకున్నారు.  గాయపడినవారు రాజగఢ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  మరి కొంతమందిని భోపాల్‌ తరలించాం’’ అని ఎక్స్‌లో తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement