Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top10 Telugu Latest News Morning Headlines 18Th May 2022 - Sakshi

1. మీరొస్తానంటే.. నేనొద్దంటా!
నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్‌ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్‌ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. టర్కీ అభ్యంతరాలు నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. టర్కీ వ్యాఖ్యల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చిందని ఫిన్లాండ్‌ ప్రధాని నినిస్టో అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. భారత టెకీలకు ఊరట..! గ్రీన్‌కార్డుల ప్రాసెసింగ్‌ విషయంలో బైడెన్‌ కీలక నిర్ణయం..!
అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం కలలుగంటున్న వేలాది మంది భారత టెకీలు ఇక అందుకోసం ఏళ్ల తరబడి వేచి చూడనక్కర్లేదు. పెండింగ్‌ కేసులతో సహా గ్రీన్‌కార్డు దరఖాస్తులన్నింటినీ ఆరు నెలల్లోపు ప్రాసెస్‌ చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రెసిడెన్షియల్‌ అడ్వైజరీ కమిషన్‌ ఏకగ్రీవంగా సిఫారసు చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Viral: బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు 
రాజస్థాన్‌లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్‌లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది. అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్‌ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బెడిసికొట్టిన ‘పచ్చ’ ప్రచారం
సోమవారం (16వ తేదీ) ఉదయం గుంటూరు కలెక్టరేట్‌ దగ్గర ఓ ఒంటరి మహిళ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు బూతులు లంఘించుకుంది. ఆమె ఎవరని ఆరా తీస్తే.. తెలుగుదేశం కార్యకర్త అని చివరికి తేలింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. Telangana Beer Prices: ‘బీర్‌’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు?
‘బీర్‌’ప్రియులకు చేదు వార్త. బీర్‌ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం. బీర్‌ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్‌ ధరల పెంపుపై ఎ క్సైజ్‌ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఇషా సింగ్‌ పసిడి గురి.. షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో మూడో స్వర్ణం సాధించిన హైదరాబాదీ
జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ తన ఖాతాలో మరో స్వర్ణ పతకం వేసుకుంది. జర్మనీలో మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇషా, మనూ, రిథమ్‌ జట్టు 16–2తో జర్మనీ జట్టుపై గెలిచింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.Shekar Movie Pre Release: రాజశేఖర్‌గారి వల్ల ఫేమస్‌ అయ్యా!  – డైరెక్టర్‌ సుకుమార్‌ 
‘‘నా ఫ్రెండ్‌ కృష్ణ అని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. తను మా ఊర్లో అందర్నీ ఇమిటేట్‌ చేస్తుంటే నేను అసూయపడేవాణ్ణి. మొదటిసారి మా ఊర్లో రాజశేఖర్‌గారిని ఇమిటేట్‌ చేశాను.. దాంతో ఫేమస్‌ అయ్యాను. స్కూల్‌లో నన్ను రాజశేఖర్‌గారిలా చేయమంటే చేసేవాణ్ణి’’ అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వాట్సాప్‌లో 2 నిమిషాల్లో ఆ బ్యాంకు నుంచి గృహ రుణం
గృహ రుణాల్లో అతిపెద్ద సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ.. వాట్సాప్‌ ద్వారా గృహ రుణలను ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. కొనుగోలుదారులకు రెండు నిమిషాల్లోపే గృహ రుణానికి సంబంధించి సూత్రప్రాయ ఆమోదం ఇస్తున్నట్టు తెలిపింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఐ యామ్‌ ఏబుల్‌.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..!
మానసిక, శారీరక వైకల్యాలున్న పిల్లలను ఎవరో ఒకరు ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకరి మీద ఆధారపడే ఈ పిల్లలు.. ‘వైకల్యాన్నే కాదు... మా నైపుణ్యాలనూ చూడండి మేమూ కొన్ని సాధించగలం’ అని చేసి చూపుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’
‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’ అని  వేర్వేరుగా జీవిస్తున్న తల్లిదండ్రులకు ఓ కుమారుడు లేఖ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నామక్కల్‌లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. నామక్కల్‌ జిల్లా కొళ్లకురిచ్చి గ్రామం పరిధిలోని సింగలాపురానికి చెందిన రవి, మేఘల దంపతులకు తరుణ్‌(17)తో పాటుగా ఓ కుమార్తె(20) ఉన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top