Evening News Headlines: టాప్ 10 తాజా వార్తలు.. ఒక్క క్లిక్‌తో..

1. చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం: మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన మంత్రి.. సచివాలయాల నూతన భవనాలను ప్రారంభించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. టీడీపీ నేతల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్య
టీడీపీ నేతల బెదిరింపులు.. ఒత్తిళ్ల వల్ల ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన రైతు దామోదర్‌రెడ్డి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. చంద్రబాబు వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కౌంటర్
పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ త్యాగం చెయ్యదన్నారు. బీజేపీ ఇప్పటికే చాలా త్యాగాలు చేసింది. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. పోలీసులకు షాక్.. అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు.. సీఎం ఫైర్
వేర్పాటువాద ఖలిస్తాన్ జెండాలు హిమాచల్‌ప్రదేశ్‌లో కలకలం రేపాయి. ఏకంగా అసెంబ్లీ ప్రధాన గేటు, గోడపై ఖలిస్తాన్ జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ధర్మశాలలో ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై ఖలిస్తాన్ జెండాలు ప్రత‍్యక్షమయ్యాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. PBKS Vs RR: ఇలాంటి బ్యాటింగ్ జట్టుకు భారం.. అయినా అతడు నాల్గో స్థానంలో ఎందుకు?
‘‘32 బంతుల్లో 31 పరుగులు.. భారీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో ఇలాంటి ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడటం కాదు.. భారంగా మారుతుంది’’ అంటూ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ ఆట తీరును టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. Ram Gopal Varma : నేను మంచి కొడుకును కాదమ్మా.. అంటూ ఆర్జీవీ పోస్ట్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వెరైటీగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో బర్త్‌డే సహా ప్రతీ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్న వర్మ తాజాగా మదర్స్ డే రోజున అపురూమైన ఫోటోను షేర్ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. Sundar Pichai: సస‍్పెన్స్‌తో చంపేశారు, ఆ సీక్రెట్‌ను రివిల్ చేసిన సుందర్ పిచాయ్!
భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్ సుందర్ పిచాయ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. Flying Saucer: గంటకు 260 కిలోమీటర్ల వేగం.. ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు
ఎగరాలంటే విమానం ఎక్కాలి. కనీసం హెలికాప్టరైనా ఉండాలి. వీటికి చాలా తతంగం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫ్లైయింగ్ కార్లు అక్కడక్కడా వస్తున్నాయి. వాటికి ఇంధనం బాగానే ఖర్చవుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లైయింగ్ సాసర్ ఉంటే, ఎక్కడికైనా తేలికగా పక్షిలా ఎగిరి వెళ్లవచ్చు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. సీఎస్‌కేతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో మరోసారి కరోనా కలకలం
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కరోనా ఆడుకుంటుంది. ఆదివారం(మే 8న) రాత్రి సీఎస్‌కేతో ఢిల్లీ మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు ఆ జట్టులో మరోసారి కరోనా వైరస్ కలవరపెట్టింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10.తిరుపతి: పోలీసులపై జనసేన నాయకుల దాడి
తిరుపతిలో జనసేన నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులపైనే చేయి చేసుకున్నారు. ఈస్ట్ సీఐ, ఎస్‌ఐలను జన సైనికులు దుర్భాషలాడారు. నిరసన పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సంబంధిత వార్తలు