కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష

Today Prime Minister Narendra Modi Review On Corona - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి తీవ్రరూపం దాలుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మంగళవారం సమీక్ష చేయనున్నారు. క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని మోదీ సమీక్ష చేస్తారని పీఎంఓ అధికారులు ప్రకటించారు.  పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వర్చువల్‌గా ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలను ప్రధానికి అధికారులు వివరించనున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న 9 రాష్ట్రాల్లోని 46 జిల్లాల అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు పీఎంఓ వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top