వర్కింగ్‌ ఫ్రమ్‌ సైకిల్: ముగ్గురు మిత్రుల సాహసయాత్ర!

Three Friends Pedal From Mumbai to Kanyakumari - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో చాలా టెక్ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించాయి. దింతో చాలా మంది ఉద్యోగులు తమ స్వంత గ్రామాలకు వెళ్లి పని చేస్తున్నారు. మరి కొంత మంది ఉద్యోగులు ఈ కరోనా భయం తగ్గే వరకు సెలవులు తీసుకున్నారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు మాత్రం చాలా కొత్తగా అలోచించి తమకు నచ్చిన సైక్లింగ్ యాత్ర చేస్తూ మధ్య మధ్య పని చేసుకున్నారు.(చదవండి: భూగర్భంలో గోల్కొండ షో!)

ఈ మహమ్మారి కారణంగా దొరికిన సమయాన్ని వారు మంచిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇటు ఆఫీస్ పని చేసుకుంటూనే వారు యాత్రను ఎంజాయ్ చేసారు. బక్కెన్ జార్జ్, ఆల్విన్ జోసెఫ్, రతీష్ భలేరావ్ అనే ముగ్గురు స్నేహితులు ఉద్యోగం చేస్తూనే సైకిల్‌పై ముంబయి నుంచి కన్యాకుమారి వరకు వెళ్లారు. ఎలాగూ ఆఫీస్కు వెళ్లాల్సిన పని లేదు కాబట్టి.. పనిచేస్తూ ఎక్కడికైనా సైకిల్‌పై విహార యాత్రకు వెళ్తే బాగుంటుందని బక్కెన్ మొదట నిర్ణయించుకున్నాడు. గతంలో బక్కెన్‌కు సైకిల్‌యాత్రలు చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ సారి ఉద్యోగం చేస్తూనే కన్యాకుమారి వరకు వెళ్లాలని బక్కెన్ నవంబర్ లో నిర్ణయించుకున్నాడు. తరువాత అతను తన ఇద్దరు స్నేహితులను ఒప్పించాడు. 

హోటళ్లే ఆఫీసులు
ఈ యాత్రలో భాగంగా వారికీ కావాల్సిన ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు వెంటపెట్టుకున్నారు. వారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 11 గంటల వరకు సైకిల్ యాత్ర చేపట్టేవారు. తర్వాత మార్గం మధ్యలో కనిపించే దాబా లేదా హోటల్‌ వద్ద ఆగేవారు. అక్కడ భోజనం చేసిన తర్వాత ఆఫీస్‌ విధుల కోసం ల్యాప్‌టాప్‌లో లాగిఇన్‌ అయి.. సాయంత్రం వరకు అక్కడే పనిచేసుకునేవారు. ఇలా వీరు 26 రోజుల్లో 1,687కి.మీ ప్రయాణించి కన్యాకుమారి చేరుకున్నారు.(చదవండి: ఇదే హవా ఉంటే మూడోసారి ప్రధాని పీఠంపై)

వారాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారు అని జోసెఫ్ పేర్కొన్నాడు. వీరు మార్గం మధ్యలో కోవిడ్ ఆంక్షల కారణంగా బస చేయడానికి కొన్ని సమస్యలు ఏర్పడేవని పేర్కొన్నారు. ఈ ప్రయాణం కోసం ఒక్కొక్కరికి సుమారు 25 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం బస, భోజనానికి ఖర్చు అయ్యాయని తెలిపారు. కానీ ఈ ప్రయాణంలో భాగంగా పని చేస్తూ ప్రకృతిని ఆస్వాదించడం తమకు బాగా నచ్చిందని వారు తెలిపారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top