తెలంగాణకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌?!.. రూట్‌పై కసరత్తులు

Telangana May Get Vande Bharat Train From Secunderabad - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ భారత దేశంలో తాజాగా తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుంది. చెన్నై(తమిళనాడు) నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు రూట్‌లో ఈ రైలు ప్రయాణించిన విషయం తెలిసిందే. నేడో రేపో పూర్తి స్థాయిలో రాకపోకలకు సిద్ధమైంది. ఈ తరుణంలో.. మరో రైలు కేటాయింపు జరిగినట్లు సమాచారం అందుతోంది. 

తెలంగాణకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాక దాదాపు ఖరారు అయ్యింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సికింద్రాబాద్‌ నుంచి ఏ రూట్‌లో రైలును నడిపించాలనే విషయంపై కసరత్తులు మొదలైంది. 

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, వైజాగ్‌, బెంగళూరు, ముంబై మార్గాలను రైల్వే బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2019లో న్యూఢిల్లీ-వారణాసి రూట్‌లో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు పెట్టింది.

పూర్తిగా స్వదేశీయంగా తయారయ్యే ఈ సెమీ-హై-స్పీడు రైలు.. గంటకు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుందని ప్రకటించారు. అయితే.. ప్రస్తుతానికి ఆ వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం దేశంలో.. నాలుగు రూట్‌లలో ఈ రైళ్లు నడుస్తుండగా.. చెన్నై-మైసూర్‌ రైలు ఐదవది కానుంది.

ఇదీ చదవండి: ‘వందేభారత్‌’కు వరుస ప్రమాదాలు.. కీలక నిర్ణయం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top