23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్ | Tejas Fighter Jet crashed In Rajasthan Jaisalmer Pilot Safe | Sakshi
Sakshi News home page

23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్

Mar 12 2024 3:35 PM | Updated on Mar 12 2024 5:18 PM

Tejas Fighter Jet crashed In Rajasthan Jaisalmer Pilot Safe - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌​కు చెందిన తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్‌లోని ఓ స్టూడెంట్ హాస్ట‌ల్ భవనం వ‌ద్ద తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ శ‌క‌లాలు ప‌డ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. జెట్‌ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలెట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పేర్కొంది.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తేజస్‌ సింగిల్‌ సీటర్‌ ఫైటర్‌ జట్‌ 23 ఏళ్ల చరిత్రలో కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పటి వరకు జరగలేదని అని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement