వింత వ్యాధితో అవస్థలు పడుతున్న విద్యార్థిని.. కంటి నుంచి...

Tamilnadu: Doctors Shocked After Ants Coming Out Of Girl Eyes - Sakshi

వేలూరు(తమిళనాడు): రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని సాత్తూరు గ్రామానికి చెందిన పూంగొడి, గాండీభన్‌ దంపతుల కుమార్తె షాలిని(14). అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే గత 6 నెలలగా ఈ బాలికకు ఎడమ కన్ను వాపు రావడంతో పాటు.. కంటి నుంచి చలి చీమలు బయటకు రావడం మొదలు పెట్టాయి. రోజుకు సగటున 15 చీమలు బయటకు వస్తున్నట్లు వారు వెల్లడించారు.

దీంతో తల్లిదండ్రులు షాలినికి వైద్య పరీక్షలు చేయింగా.. అన్నీ టెస్ట్‌లు నార్మల్‌గానే ఉన్నట్లు తెలిసింది. కంటి నుంచి రోజూ చలి చీమలు వస్తూనే ఉండడంతో పాఠశాలకు వెళ్లలేక, సాధారణ జీవితాన్ని అనుభవించలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.  ఈ మేరకు విద్యార్థినితో పాటు ఆమె తల్లి పూంగొడి కలెక్టర్‌ భాస్కర్‌ పాండియన్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించింది. ఆయన వాలాజలోని ప్రభుత్వ కంటి వైద్యశాలలో బాలికను చేర్పించి చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కంటి వైద్య నిపుణులు విద్యార్థినిని పర్యవేక్షిస్తున్నారు.

చదవండి: నటుడి కుమార్తె భర్త కిడ్నాప్‌.. రాజ్యలక్ష్మి ఇంట్లో డెడ్‌ బాడీ.. ఏం జరిగింది..?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top