స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్: నాలుగో స్థానంలో విజ‌య‌వాడ‌

Swachh Survekshan 2020: Indore Named Cleanest City Of India 4th Time - Sakshi

టాప్ టెన్‌లో విజ‌య‌వాడ‌, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2020’ అవార్డులు ప్ర‌క‌టించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇలా వ‌రుస‌గా నాలుగో సారి ఇండోర్‌ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవ‌డం విశేషం. రెండో స్థానంలో సూర‌త్‌(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మ‌హారాష్ట్ర‌) నిలిచాయి. మొద‌టి ప‌ది స్థానాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి న‌గ‌రాలు కూడా చోటు ద‌క్కించుకున్నాయి. గురువారం 'స్వ‌చ్ఛ మ‌హోత్స‌వ్' కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా జ‌లంద‌ర్ కాంత్ దేశంలోనే అత్యంత ప‌రిశుభ్ర‌త క‌ల కంటోన్మెంట్‌గా ప్ర‌క‌టించారు. ప‌రిశుభ్ర‌త గ‌ల ప‌ట్ట‌ణంగా వార‌ణాసి చోటు ద‌క్కించుకుంది. 4,242 న‌గ‌రాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా స‌మీపంలోని‌ ప‌ట్ట‌ణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన‌ స‌ర్వేలో పాల్గొన్నారు. ఈ స‌ర్వే 28 రోజుల పాటు చేప‌ట్ట‌గా అనంత‌రం ర్యాంకులు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మ‌ళ్లీ త‌న ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డంపై ఆ ప్రాంత ఎంపీ శివ‌రాజ్ చౌహాన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ నగ‌ర శుభ్ర‌త ప‌ట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు. (రూల్స్‌ బ్రేక్‌: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...)

ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు
దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆరో స్థానాన్ని ద‌క్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే ప‌రిశుభ్ర‌త గ‌ల న‌గ‌రంగా విజ‌య‌వాడ నాలుగో స్థానం ద‌క్కించుకుంది. తిరుప‌తి ఆరో ర్యాంకు, విశాఖ‌ప‌ట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేట‌గిరీలో రాజ‌మండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం ద‌క్కించుకున్నాయి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top