స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు

Supreme Court Said Same Sex Marriage Issue Of Seminal Importance - Sakshi

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషన్లపై తుది వాదనలను వినేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది సుప్రీం కోర్టు. ఏప్రిల్‌ 18వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. 

ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని తెలిపింది. ఈ కేసుకి సంబంధించిన వాదనలు సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో లేదా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ధర్మాసనం తెలిపింది. ఇది సమాజంపై ప్రభావం చూపే కీలక అంశం కాబట్టి దీన్ని పరిగణలోని తీసుకోని సరైన తీర్పు ఇవ్వాలని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 145(3) ప్రకారం.. ఐగుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఈ సమస్యను పరిష్కరించడమే సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇటీవల నలుగురు స్వలింగ సంపర్కులు తమ వివాహాలను గుర్తించడమే గాక తమకు నచ్చి వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఐతే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు ప్రభత్వం తరుఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్వలింగ సంపర్కుల వివాహలను గుర్తిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని అన్నారు. పైగా ఇద్దరు స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగిన వివాహానికి వ్యక్తిగత చట్టాలు లేదంటే రాజ్యంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. 

(చదవండి: పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు.. అదే తేదీన కవిత విచారణ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top