ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఫైన్‌ లేదు! వారంపాటు.. ఎక్కడంటే..

This State Announced No Fine Traffic Violations For Diwali Week - Sakshi

దీపావళి సందర్భంగా అక్కడ వారంపాటు ట్రాఫిక్‌ రూల్స్‌ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు గానూ ఎలాంటి ఫైన్‌ విధించబోమని ప్రకటించింది గుజరాత్‌ ప్రభుత్వం.  అక్టోబర్‌ 21 నుంచి 27 తేదీల మధ్య ఈ నిర్ణయం అమలులో ఉంటుందని హోం శాఖ మంత్రి హర్ష్‌ సంఘవీ ప్రకటించారు.

దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈ వార్త చెబుతున్నాం. అలాగని ఈ నిర్ణయంతో రూల్స్‌ను అతిక్రమించాలని మాత్రం చూడకండి. ఒకవేళ రూల్స్‌ బ్రేక్‌ చేస్తూ పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, గుజరాత్ పోలీసులు వెంటనే పూలు ఇచ్చి శిక్షిస్తారు అని ప్రకటించారు. అంతేకాదు.. దీపావళి సందర్భంగా భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వం మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు ప్రకటించబోతోందని హర్ష్‌ సంఘవీ తెలిపారు. 

గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు నో జరిమానా  నిర్ణయంపై నెట్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top