సోనాల్‌ ఫోగట్‌ మృతిలో మరో ట్విస్ట్‌.. నైట్‌ క్లబ్‌ వీడియో వైరల్‌

Sonali Phogat Night Club Video Viral On Social Media - Sakshi

ఛండీగఢ్‌: బీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు.  గోవాలో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రిపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు. 

ఇదిలా ఉండగా.. సోనాల్‌ ఫోగట్‌ మృతిపై ఆమె సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు. సోనాల్‌ ఫోగట్‌ పీఏ సుధీర్‌ సంగ్వాన్‌, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని అన్నాడు. ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి లోబర్చుకున్నారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

కాగా, రింకు ఆరోపణ నేపథ్యంలో సోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్‌ తన పీఏ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్ల‌బ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసిన‌ట్లు ఆ వీడియోలో ఉంది. వారందరూ ఎంతో ​క్లోజ్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, పోస్టుమార్ట‌మ్ రిపోర్ట్ ప్ర‌కారం సోనాలి శ‌రీరంపై బ‌ల‌మైన గాయాలు ఉన్న‌ట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు.

ఇది కూడా చదవండి: ఊహించని విషాదం.. మరణం ముందర సరదాగా సోనాలి.. అభిమానుల భావోద్వేగం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top