తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో కుమారుని మృతి | Son Dies Before Cremating Father | Sakshi
Sakshi News home page

తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో కుమారుని మృతి

Sep 4 2024 7:10 AM | Updated on Sep 4 2024 7:10 AM

Son Dies Before Cremating Father

బివార్: విధి రాతను ఎవరూ తప్పించలేరని అంటారు. కొన్ని ఉదంతాలు చూసినప్పుడు ఇది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది. రాజస్థాన్‌లోని బివార్ జిల్లాలో గల జాలియా గ్రామంలో విధి ఆడిన వింత నాటకం స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి మృతదేహాన్ని స్మశాన వాటికవరకూ తీసుకెళ్లిన కుమారుడు హఠాత్తుగా కన్నుమూశాడు.

వివరాల్లోకి వెళితే జాలియా గ్రామంలోని బ్రహ్మపురి ప్రాంతంలో నివసిస్తున్న రాధాకృష్ణ నాగ్లా అనే వృద్ధుడు మృతిచెందాడు. తండ్రి మరణంతో అతని కుమారుడు మహావీర్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బంధువుల సహాయంతో తండ్రి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లాడు. తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో స్పృహ తప్పిపడిపోయాడు. అతనిని గమనించినవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహావీర్‌ ప్రసాద్‌ మృతి చెందాడు.  

విషయం తెలుసుకున్న బంధువులంతా షాకయ్యారు. చివరికి వారే తొలుత రాధాకృష్ణకు, ఆ తరువాత మహావీర్‌ ప్రసాద్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.  మహావీర్ ప్రసాద్ సోదరుడు రాజ్ కుమార్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఇప్పుడు రాధాకృష్ణ, మహావీర్‌ ప్రసాద్‌లు మృతిచెందడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement