Siddaramaiah Post For Rcb Team Wins Kannadiga Hearts - Sakshi
Sakshi News home page

ఆర్సీబీ ఈసారి కచ్చితంగా కప్పు గెలుస్తుంది.. కన్నడిగుల మనసు దోచుకున్న సిద్ధరామయ్య ట్వీట్‌

Apr 3 2023 5:58 PM | Updated on Apr 3 2023 7:10 PM

Siddaramaiah Post For Rcb Team Wins Kannadiga Hearts - Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌లో ముంబైపై ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం క‍ర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య చేసిన ట్వీట్ కన్నడిగుల మనసులు దోచుకుంది. ఆర్సీబీ తన అభిమాన జట్టు అని, ఈ టీంను చూస్తే తనకు గర్వంగా ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు.

ఆర్సీబీ జట్టుకు నాలాగే కోట్ల మంది అభిమానులున్నారు. ఈసారి మనం కచ్చితంగా ఐపీఎల్ కప్పు గెలుస్తామని నాకు బలమైన విశ్వాసం ఉంది. ఒక కన్నడిగగా.. నా మద్దతు ఎప్పుడూ ఆర్‌సీబీకే ఉంటుంది' అని సిద్ధ రామయ్య ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్‌ను ఆయన స్టేడియంకు వెళ్లి స్వయంగా వీక్షించి ఆద్యంతం ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా మ్యాచ్‌ను తిలకించారు.

ఆర్సీబీ జట్టుకు కోట్ల మంది అభిమానులున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోవడం వారిని నిరుత్సాహపరిచే ఏకైక విషయం. మొత్తం 15 సీజన్లలో మూడు సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది.  2009, 2011, 2016 సీజన్లలో రన్నరప్‌గా నిలిచి సరిపెట్టుకుంది.
చదవండి: కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్‌ దొబ్బినట్లుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement