
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ముంబై పట్రా చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకల కేసులో ఆగస్ట్ ఒకటో తేదీన ఈడీ సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. రౌత్ బెయిల్ పిటిషన్‌పై 21న కోర్టు విచారణ చేపట్టనుంది.