లోక్‌సభలో ‘సేన’ నేతగా రాహుల్‌ షెవాలే: షిండే 

Shinde said Rahul Shewale as Shiv Sena Leader in Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో శివసేన పార్టీ నాయకుడిగా రాహుల్‌ షెవాలేను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో ప్రస్తుతం శివసేనకు 19 మంది సభ్యులుండగా షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే సహా 12 మంది మంగళవారం స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. లోక్‌సభలో తమ పార్టీ నేతగా వినాయక్‌ రౌత్‌ స్థానంలో రాహుల్‌ షెవాలేను గుర్తించాలని కోరారు. ఇందుకు స్పీకర్‌ సమ్మతించారని హేమంత్‌ గాడ్సే అనే ఎంపీ తెలిపారు. ఇలా ఉండగా, వినాయక్‌ రౌత్‌ సోమవారం రాత్రి స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి శివసేన పార్లమెంటరీ పార్టీ నేతగా తనను, పార్టీ చీఫ్‌ విప్గా రాజన్‌ విచారేను గుర్తించాలని వినతి పత్రం అందజేయడం గమనార్హం.

షిండే వర్గంలోకి ఆ 12 మంది ఎంపీలు..
లోక్‌సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్‌నాథ్‌ షిండేతో సోమవారం వర్చువల్‌ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్‌ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు.. ‘వై’ కేటగిరి భద్రత ఏర్పాటు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top