
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. హెచ్‌ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయభేరీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్ విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఓ కొనుగోలుదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.