ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్‌.. మార్కెట్‌ విలువ రూ.126 కోట్లు

Rs 126 Crore Of Heroin Seized From 2 South African Men at Delhi Airport - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దేశంలోకి దొంగతనంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

శనివారం జొహన్నెస్‌బర్గ్‌ నుంచి దోహా మీదుగా వచ్చిన వీరి లగేజీని తనిఖీ చేయగా బ్యాగుల్లో తెల్లటి పౌడర్, గుళికల రూపంలో ఉన్న సుమారు 18 కిలోల బరువున్న రూ.126 కోట్ల విలువైన హెరాయిన్‌ బయటపడిందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ట్రాలీ బ్యాగుల్లో వీటిని కనిపించకుండా దాచి ఉంచారని చెప్పారు.

చదవండి:
DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వద్దు
 
Kukatpally: మూఢ నమ్మకం.. తీసింది ప్రాణం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top