జనరల్‌ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌: కేంద్రం

Reservation For Economically Weaker Sections Only From General Quota - Sakshi

న్యూఢిల్లీ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్‌ కోటాలో ఎలాంటి కోత లేదని, కేవలం జనరల్‌ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌కు స్థానం కల‍్పించామని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది. ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్‌ స్వాతంత్య్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు.

ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు కేంద్రం 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న విషయం విదితమే. రిజర్వేషన్‌ కల్పనకు ఆర్థిక పరిస్థితి గీటురాయి కాదని, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను కోర్టు సమరి్థంచాలనుకుంటే అంతకుముందుగా ఇందిరా సహానీ(మండల్‌) తీర్పును çసమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది.

ఇదీ చదవండి: పట్టణ శ్రేయస్సు ముఖ్యం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top