'రిపబ్లిక్‌ టీవీ'కి మరో షాక్‌ | Republic TV Distribution Head Arrested In Mumbai In Ratings Case | Sakshi
Sakshi News home page

'రిపబ్లిక్‌ టీవీ'కి మరో షాక్‌

Nov 10 2020 11:36 AM | Updated on Nov 10 2020 11:40 AM

Republic TV Distribution Head Arrested In Mumbai In Ratings Case - Sakshi

ముంబై : టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్‌ టీవీ’ డిస్స్ర్టిబ్యూషన్‌ హెడ్‌ ఘన్శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు తాజాగా సింగ్‌ను 12వ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మంగళవారం ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారని పోలీసు అధికారులు తెలిపారు. కాగా రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అర్నాబ్‌ గోస్వామి సహా మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే రిపబ్లిక్‌ టీవీ  డిస్స్ర్టిబ్యూషన్‌ హెడ్‌ను అరెస్ట్‌ చేశారు. ముంబైలో టీఆర్‌పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. అయితే ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్‌ చానల్‌తో పాటు ఫక్త్‌ మరాఠీ, బాక్స్‌ సినిమా వంటి రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి. (అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్‌ )

టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్‌ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు ఆరోపించారు. మరో వైపు టీఆర్పీ రేటింగ్‌ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్‌ చానళ్ల వారపు రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌)  ప్రకటించింన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్‌ తెలిపింది. టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. బార్క్‌ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్‌ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్‌ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారించారు. అయితే ముం‍బై పోలీసులు చేస్తోన్న ఆరోపణల్ని రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం ఖండించింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మరణంపై పోలీసుల దర్యాప్తును ప్రశ్నించినందుకే తమ ఛానల్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. (అర్నాబ్‌కు బెయిల్‌ నో )


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement