మేఘం వన్నె చిరుత.. సోషల్‌ మీడియాలో వైరల్‌ | Sakshi
Sakshi News home page

మేఘం వన్నె చిరుత.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Published Sat, Jan 8 2022 1:59 PM

Rare Clouded Leopard Spotted First Time Nagaland Mountains - Sakshi

న్యూఢిల్లీ: మేఘం వన్నె చిరుతలు బయట కనిపించడం ఇప్పటి వరకు బహు అరుదు. సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే సతత హరిత అరణ్యాలలో కనిపించే ఈ రకమైన చిరుతలు మొట్టమొదటిసారిగా భారత్‌–మయన్మార్‌ సరిహద్దుల్లో నాగాలాండ్‌లోని 3,700 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతా ల్లో కనిపించింది. 2020 జనవరి–జూన్‌ నెలల మధ్యలో పరిశోధకులు అమర్చిన 37 కెమెరాలు వీటి కదలికలను రికార్డు చేశాయి. భారత్‌లో ఇంత ఎత్తైన ప్రాంతాల్లో ఇవి కనిపించడం తొలిసారని పరిశోధకులు అంటున్నారు. ఈ రకం చిరుతలు ఇండోనేసియాతోపాటు హిమాలయ పర్వతాల్లో నివసిస్తుంటాయి.

చాలా అరుదుగా కనిపిస్తుండటం తో వీటిని అంతరించిపోయే జాతిగా భావిస్తున్నారు. నాగాలాండ్‌లోని 65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని థానమిర్‌ కమ్యూనిటీ అటవీ ప్రాంతం లోని 7 చోట్ల ఇటువంటి చిరుతలు రెండు పెద్దవి, రెండు కూనలు కనిపించినట్లు వైల్డ్‌లైఫ్‌ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూపీఎస్‌ఐ) తెలిపింది. సుమారు 3,700 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలవని తాజా పరిశీలనతో రుజువైందని డబ్ల్యూపీఎస్‌ఐ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement