బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Rajasthan BJP Ex MLA Said We Have Killed Five So Far Give Examples - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్‌ ఆహోజా చేసిన వ్యాఖ్యలు పెను వివాస్పదంగా మారడమే గాక మత విద్వేషాలకు తెరలేపింది. ఈ మేరకు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు కూడా. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేశారు.

ఆ హత్యలు లాలావాండి లేదా బెహ్రూర్‌లో కావచ్చు అంటూ రక్బర్‌ ఖాన్‌, పెహ్లూ ఖాన్‌ హత్యలు గురించి ప్రస్తవించారు. అంతేకాదు వాటిలో ఒక హత్యను 2017లో మరోకటి 2018లో చేశామని బహిరంగంగా చెప్పారు. అవన్నీ కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామ్‌గఢ్‌లో జరిగిందని చెప్పడం విశేషం. తమ కార్యకర్తలకు చంపడానికి స్వేచ్ఛ ఇచ్చానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారు హత్య చేసిన వెంటనే బెయిల్‌ పొందడమే గాక నిర్దోషులుగా విడుదలవుతారని చాలా ధీమాగా చెబుతున్నారు.

కానీ రాజస్తాన్‌లోని అల్వార్‌ నియోజకవర్గం బీజేపీ చీఫ్‌ సంజయ్‌ సింగ్‌ మాత్రం అవన్నీ అతని వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు. తమ పార్టీ ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయదంటూ...  మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలన్నింటిని తీవ్రంగా ఖండిచారు. వాస్తవానికి  పెహ్లూ ఖాన్, రక్బర్ ఖాన్ ఇద్దరు హర్యానకు చెందిన పాల వ్యాపారులు.

ఐతే పెహ్లు ఖాన్‌ బెహ్రూర్‌లో 2017 ఏప్రిల్‌లో హత్యకు గురవ్వగా రక్బర్‌ ఖాన్‌ జులై 2018లో లాలావండి గ్రామంలో హత్యకు గురయ్యారు. పోలీసులు కూడా ఈ రెండు మతపరంగా జరిగిన హత్యలుగానే గుర్తించారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా బీజేపీ మతపరమైన ఉగ్రవాదానికి, మతోన్మాదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. బీజేపీ రంగు బట్టబయలైంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టారు.

(చదవండి: లిక్కర్‌ కుంభకోణంలో అసలు సూత్రధారి కేజ్రీవాల్‌: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ధ్వజం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top