పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లివ్వాలి

Provide Free Laptops, Mobiles to EWS Students: Delhi HC - Sakshi

పాఠశాల యాజమాన్యాలదే బాధ్యతన్న ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకొనేందుకు ఎలక్ట్రానిక్‌ సాధనాలు, ఇంటర్నెట్‌ ప్యాకేజీ ఉచితంగా కల్పించాలని, అలా చేయకపోవడం వివక్షేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్‌ సాధనాలు, ఉపకరణాలు లేవనే పేరుతో ఒకే తరగతిలో విద్యార్థులను వేర్వేరుగా చూస్తే, అది పేద విద్యార్థుల్లో న్యూనతాభావాన్ని పెంచుతుందని, అది వారి హృదయాలను గాయపరుస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు ఆన్‌లైన్‌ విద్యావకాశాలు పొందేలాగా చూడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యాల మీద ఉందని తెలిపింది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఉచితంగా అందించాలని ఆదేశించింది.

‘జస్టిస్‌ ఫర్‌ ఆల్‌’ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ మన్‌మోహన్, జస్టిస్‌ సంజీవ్‌ నరూలాల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కుని నిరాకరించడమేనని, విద్యాహక్కు చట్టానికి కూడా వ్యతిరేకమైనదని కోర్టు స్పష్టం చేసింది.  పేద విద్యార్థులకు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అందించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కమిటీ చర్యలు చేపట్టాలని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను ఆదేశించింది. (చదవండి: మాస్క్‌ లేదని ఫైన్‌.. 10 లక్షల పరిహారం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top