హర్‌సిమ్రత్‌ కౌర్ రాజీనామా ఆమోదం

President RamNath Kovind Accepts Harsimrat Kaur Badals Resignation - Sakshi

సాక్షి, ఢిల్లీ :  అకాలీద‌ళ్ ఎంపీ, కేంద్ర‌మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్ బాద‌ల్  రాజీనామాను రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. త‌క్ష‌ణం ఆమె రాజీనామాను అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్ శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. కేంద్ర‌ప్ర‌భుత్వం  ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్‌ నిర్ణయించింది. ఈ మేర‌కు గురువారం లోక్‌స‌భ‌లో అకాలీద‌ళ్ నేత హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ రాజీనామా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని  నాలుగు పేజీల  రాజీనామా లేఖ‌ను సమర్పించారు. రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌కు నిర‌స‌న‌గా రాజీనామా చేస్తున్న‌ట్లు హర్‌సిమ్రత్‌ కౌర్ బాద‌ల్ ప్ర‌క‌టించారు. రైతు బిడ్డ‌గా, వారికి సోద‌రిలా నిల‌బ‌డ‌టం గ‌ర్వంగా ఉంద‌ని తెలిపారు. రైతు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా వ్య‌వ‌సాయ‌రంగ బిల్లుల‌ను తీసుకువ‌చ్చిన ప్ర‌భుత్వంలో తాను భాగ‌స్వామ్యం కావ‌డం ఇష్టం లేద‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. (వ్యవసాయ బిల్లులకు నిరసనగా రాజీనామా)

బిల్లుల‌కు నిర‌స‌న‌గా భార‌త్‌బంద్
రైత‌లుకు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని పేర్కొంటూ వ్య‌వ‌సాయ బిల్లుల‌ను కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. వీటి ద్వారా వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా చేపట్టామని బీజేపీ పేర్కొంటోంది. కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్, డీఎంకె, బీఎస్పీ స‌హా ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ బిల్లుల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించాయి. చిన్న‌, స‌న్న‌కారు రైతుల ప్రయోజ‌నాలు దెబ్బ‌తీసేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుందంటూ ఆరోపించాయి. ఇక  ఈ బిల్లులపై పంజాబ్‌, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా, కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ‌బిల్లుల‌కు వ్య‌తిరేకంగా అఖిల భార‌త కిసాన్ సంఘ‌ర్ష్ స‌మ‌న్వ‌య క‌మిటీ (ఎఐకెఎస్సిసి) సెప్టెంబ‌రు 25న భార‌త‌బంద్‌కు పిలుపునిచ్చింది. (ఉల్లి ఎగుమతుల నిషేధంపై ఎన్సీపీ ఫైర్‌)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top