వ్యవసాయ బిల్లులకు నిరసనగా రాజీనామా

Union Minister Harsimrat Badal Quits - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్‌ నిర్ణయించింది. రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అకాలీదళ్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. వ్యవసాయ బిల్లులపై ఎన్డీయేకు తన వైఖరి స్పష్టం చేసిన అకాలీదళ్‌ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతిస్తామని పేర్కొంది.

హర్‌సిమ్రత్‌ కౌర్‌ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని రాజీనామా సమర్పించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని లోక్‌సభలోనే అకాలీదళ్‌ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేశారు. కాగా ఈ బిల్లులను వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా చేపట్టామని బీజేపీ పేర్కొంటోంది. ఈ బిల్లులపై పంజాబ్‌, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోంది.

చదవండి : టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top