రాష్ట్రపతిగా మూడేళ్లు

President Ram Nath Kovind completes 3 years - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంనాటికి పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ఒక ట్వీట్‌లో వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో 7వేల మంది సైనికులు, శాస్త్రవేత్తల్ని కోవింద్‌ కలుసుకున్నట్టు ఆ ట్వీట్‌లో వెల్లడించింది. ఈ మూడేళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంక్షోభ సమయంలో ప్రదర్శించిన మానవత్వం గురించి రాష్ట్రపతి భవన్‌ వివరించింది.

► కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కి రాష్ట్రపతి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఏడాదిపాటు 30% జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు.

► కరోనా నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ తొలిసారిగా డిజిటల్‌ సదస్సులను ఏర్పాటు చేసింది. ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడి కరోనా పరిస్థితులపై చర్చలు జరిపారు.

► రాష్టపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ ద్వారా ఆహ్వానించే ఈ–ఇన్విటేషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

► పార్లమెంటు పాస్‌ చేసిన 48 బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాల 22 బిల్లుల్ని ఆమోదించారు. 13 ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. 11 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు.

► రాష్ట్రపతి భవన్‌లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వినియోగంపై నిషేధం విధించి వాటి స్థానంలో గాజు బాటిల్స్‌ను వినియోగించడం మొదలు పెట్టారు.

► మూడో ఏడాది పదవీకాలంలో రామ్‌నాథ్‌ ఏడు రాష్ట్రాల్లో పర్యటించారు.

► రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుసుకున్న కోవింద్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధి విషయంలో మూడేళ్లుగా కోవింద్‌తో కలిసి పని చేస్తుండడం అద్భుతమైన అనుభూతినిస్తోందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top