ముగిసిన మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికల పోలింగ్‌

Polling in Nagaland and Meghalaya today - Sakshi

Updates
మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన పోలింగ్‌ ముగిసింది. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు 3,419 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్‌ నిర్వహించగా.. నాగాలాండ్‌లో 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మేఘాలయ, నాగాలాండ్‌తోపాటు ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. 

► నాగాలాండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 81.94% పోలింగ్‌ నమోదైంది.

►  మేఘాలయలో సాయంత్రం 5 గంటల వరకు 74.32% పోలింగ్‌ నమోదైంది.

► నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 60.51% ఓటింగ్ నమోదైంది.

మేఘాలయ తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చార్లెస్ పింగ్రోప్ షిల్లాంగ్‌లోని తన నియోజకవర్గం నోంగ్తిమ్మాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► నాగాలాండ్‌లో ఉదయం 11 గంటల వరకు 38.68 శాతం ఓటింగ్‌ నమోదు. 

ఓటు హక్కు వినియోగించుకున్న మేఘాలయ సీఎం కార్నాడ్‌ సంగ్నా. గారో హిల్స్‌లోని తురా పోలింగ్‌ స్టేషన్‌లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్బంగా సీఎం సంగ్మా మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది శుభపరిణామం. ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని నా నమ్మకం అంటూ కామెంట్స్‌ చేశారు.  

9.00AM

 ఉదయం తొమ్మిది గంటల వరకూ మేఘాలయలో 12 శాతం, నాగాలాండ్‌లో 15.76 శాతం పోలింగ్‌ నమోదైంది

నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌  కొనసాగుతోంది. ఈ రోజు(సోమవారం) ఉదయం గం. 7.00లకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్‌ జరుగనుంది.  అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

కాగా, రెండు రాష్ట్రాల్లో 552 మంది బరిలో ఉన్నారు. 34 లక్షలకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా, బరిలో 369 మంది అభ్యర్థులు నిలిచారు. 21.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 60 స్థానాలకుకు గాను 59 స్థానాల్లో పోటీ జరుగునుంది. ఇక్కడ ఒక స్థానాన్ని బీజేపీ ముందుగానే కైవసం చేసుకుంది.  సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఖతేజో కినిమి అకులుటో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాం్‌లో 183 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓటర్లు సంఖ్య 13లక్షలకుపైగా ఉంది. మేఘాలయాలో ఇప్పటిదాకా ఏపార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. నాగాలాండ్‌లో ఏ పార్టీ అన్నిచోట్లా పోటీకి దిగలేకపోయింది. ఇక తమిళనాడు, అరుణాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top