ఆప్‌కు భారీ షాక్‌.. పదిరోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే, లేకుంటే ఆఫీస్‌కు సీజ్‌!

Political Ads Row AAP Get Notices According To LG Orders - Sakshi

ఢిల్లీ: అధికారిక పార్టీ ఆమ్‌ ఆద్మీకి ఎల్జీ వీకే సక్సేనా భారీ ఝలక్‌ ఇచ్చారు. పదిరోజుల్లో రూ. 164 కోట్లు చెల్లించాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇప్పించారాయన. అలా చేయని పక్షంలో.. చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని ఆ రికవరీ నోటీసుల్లో పేర్కొని ఉంది.

రూ. 164 కోట్ల చెల్లింపునకు ఇదే చివరి అవకాశం. నోటీసులకు స్పందించింది పదిరోజుల్లోగా ఆప్‌ కన్వీనర్‌ ఈ డిపాజిట్‌ చేయాలి. లేకుంటే చట్టం ప్రకారం ముందుకెళ్తాం. పార్టీకి సంబంధించి ఆస్తులను సైతం జప్తు చేయడానికి వెనకాడం. ఆప్‌ కార్యాలయానికి సీజ్‌ చేస్తాం అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలను సైతం అందులో ప్రస్తావించింది డీఐపీ. 

ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్‌ ప్రకటనలు ఇచ్చుకుందని, అందుకోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఆప్‌ వృధా ఖర్చు చేసిందని పేర్కొంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. ఆప్‌ మీద చర్యలకు ఆదేశించారు. డిసెంబర్‌ 20వ తేదీన 97 కోట్ల రూపాయల్ని ఆప్‌ నుంచి రికవరీ చేయాలంటూ ఎల్జీ ఆదేశించారు కూడా. అయితే.. పొలిటికల్‌ యాడ్‌ల మీద 2017, మార్చి 31 దాకా రూ.99 కోట్లు ఖర్చు చేశారని, మిగిలిన రూ.64 కోట్లను ఖర్చు చేసినదానికి వడ్డీగా తాజా నోటీసుల్లో పేర్కొంది డీఐపీ. 

ఎల్జీ ఆదేశాలను ఆప్‌ మొదటి నుంచి బేఖాతరు చేస్తూ వస్తోంది. బీజేపీతో కలిసి ఆప్‌ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎల్జీ మండిపడుతోంది కూడా. ఇక ఇప్పుడు రూ. 163 కోట్లకుపైగా రికవరీకి.. అదీ పది రోజుల గడువు విధించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top