షెల్‌ కంపెనీ పేరుతో ఆప్‌కు భారీ విరాళం

Police Arrests Businessman For Donating Rs 2 Crore To AAP Through Shell Company - Sakshi

ఢిల్లీ వ్యాపారి అరెస్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ : షెల్‌ కంపెనీ ద్వారా ఢిల్లీలో పాలక ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి రూ 2 కోట్ల విరాళం అందించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఒకరిని ఢిల్లీకి చెందిన వ్యాపారి ముఖేష్‌ శర్మగా గుర్తించినట్టు ఢిల్లీ పోలీస్‌ ఆర్థిక నేరాల విభాగం అధికారులు వెల్లడించారు. వీరిపై 2014, మార్చి 31న డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా ఆప్‌కు విరాళం అందచేశారనే ఆరోపణలున్నాయి. ఢిల్లీకి చెందిన ముఖేష్‌ శర్మ పొగాకు వ్యాపారంతో పాటు ప్రాపర్టీ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

కాగా ఆప్‌ బహిష్కృత నేత ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా సైతం ఆప్‌కు షెల్‌ కంపెనీ ద్వారా విరాళం అందిందని ఆరోపించారు. ఆప్‌కు నిధులను సమీకరించడంలో తీవ్ర అవకతవకలు చోటుచేసకున్నాయని అప్పట్లో మిశ్రా ఆరోపించారు. పార్టీకి అందిన రూ 2 కోట్ల విరాళంపైనా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఆప్‌కు పలు షెల్‌ కంపెనీల నుంచి నిధులు లభించాయని, పార్టీకి సైతం ఈ విషయం తెలుసునని మిశ్రా ఆరోపించారు.

చదవండి : వామ్మో.. ఇదేందిది ఇంత ట్రాఫిక్‌ జామ్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top