అణగారిన వర్గాల ఆశాజ్యోతి

PM Narendra Modi and President Murmu pay tribute to Ambedkar - Sakshi

అంబేడ్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల అభ్యన్నతికోసం అంబేడ్కర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ కొనియాడారు.

పార్లమెంట్‌ ప్రాంగణంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నేలంతా ఘనంగా నివాళులర్పించారు.

ప్రమాదకర ధోరణి: ఖర్గే
ప్రత్యర్థులపై జాతి వ్యతిరేక ముద్ర వేయడం, బలవంతంగా నోరు మూయించడం వంటి ప్రమాదకర ధోరణులు పాలకుల్లో నానాటికీ పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వెలిబుచ్చారు. ఇది అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందన్నారు. పార్లమెంటు చర్చా వేదికను కూడా అధికార బీజేపీ పోరాటస్థలిగా మార్చిందని దుయ్యబట్టారు. ఖర్గే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తదితరులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఖర్గే, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వద్రా తదితరులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలపై వ్యవస్థీకృత దాడి జరుగుతోందంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top