
తన శిష్యుడు మంచి స్థానంలో ఉంటే.. ఆ గురువుకి కలిగే ఆనందమే వేరు.
అహ్మదాబాద్: గురుశిష్యుల అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. అందునా తన శిష్యుడు మంచి స్థానంలో ఉంటే.. ఆ గురువుకి కలిగే ఆనందమే వేరు. చాలా ఏళ్ల తర్వాత తనకు విద్య నేర్పిన గురువును కలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ గుజరాత్‌లో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. నవ్సారి వద్‌నగర్‌లో చిన్నప్పుడు తనకు పాఠాలు బోధించిన ఓ ఉపాధ్యాయుడ్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం, మంచి చెడు ఆరా తీశారు.
ప్రధాని హోదాలో తన పూర్వ విద్యార్థిని చూసి ఆ ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబ్బితబ్బిబ్బి అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు ప్రధాని మోదీతో ఆప్యాయంగా ముచ్చటించి.. ఆశీర్వదించి వెళ్లిపోయారు ఆ పెద్దాయన. ప్రస్తుతం వాళ్ల కలయిక గురించి ప్రస్తావిస్తూ.. ఓ ఫొటో వైరల్ అవుతోంది.
गुजरात : नवसारी में PM @narendramodi ने स्कूल समय के अपने शिक्षक से की मुलाकात pic.twitter.com/Q5vQ2Wz8TB
— News24 (@news24tvchannel) June 10, 2022