మీ సంగతి ప్రజలే చూసుకుంటారు: నరేంద్ర మోదీ

People Said Modi Your Lotus Will Bloom PM Narendra Modi Counters - Sakshi

తనపై కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరే ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.  ‘ మీ సమాధిని తవ్వుతారంటూ’ కాంగ్రెస్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మోదీ గట్టిగానే బదులిచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారి సంగతి ప్రజలే చూసుకుంటారని మోదీ స్పష్టం చేశారు. ఒకవైపు దేశ ప్రజలు కమలం వికసిస్తోందని అంటుంటే, కాంగ్రెస్‌ మాత్రం సమాధిని తవ్వుతామని వ్యాఖ్యానించడం వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారని అనడానికి నిదర్శనమన్నారు. తనపై కామెంట్లు చేసే వారంత దేశ ప్రజల చేత బహిష్కరించబడ్డవారేనని మోదీ చమత్కరించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు మోదీ. 

ఆ ర్యాలీలో కాంగ్రెస్‌ నాయకుడి అరెస్టును ప్రస్తావించకుండా కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. సుప్రీం కోర్టు సైతం ఈ విషయమై ప్రశ్నించినా.. పక్కన పెట్టి కాంగ్రెస్‌ పార్టీ కుటుంబమే ఫస్ట్‌ అంటూ దాన్నే అనుసరిస్తుందని విమర్శలు గుప్పించారు మోదీ. ఐతే మేఘాలయ ప్రభుత్వం మాత్రం ప్రజలే ఫస్ట్‌ అనే నినాదానికి పిలుపునిస్తోంది కాబట్టే అక్కడ కమలం శాంతి, స్థిరత్వానికి పర్యాయ పదంగా నిలిచిందన్నారు. అంతేగాదు ఈ రోడ్‌ షోలో ప్రజలకు తనకు మద్దతు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపారు.

తనపై కురిపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు చెప్పడమే గాక తనపై చూపిన ప్రేమ ఆశీర్వాదాలకు మేఘాలయా అభివృద్ధి చేసి వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటామన్నారు. కాగా, మేఘాలయలో ఫిబ్రవరి 27న నాగాలాండ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఛత్తీస్‌గఢ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకోవడంతో ఆ పార్టీ సభ్యులు ఈ విధంగా మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

(చదవండి: పెళ్లిరోజు మర్చిపోయినందుకు భర్తపై దాడి..నివ్వెరపోయిన పోలీసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top