ఉగ్రవాది ఉన్నాడంటూ హల్‌చల్‌ చేసిన వ్యక్తి

Passenger Claims Terrorist Present Onboard Delhi Goa Flight - Sakshi

పనాజీ: విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ ఓ ప్రయాణికుడు హల్‌చల్‌ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఎయిరింయా విమానంలో చోటు చేసుకుంది. వివరాలు.. జియా ఉల్‌ హక్‌(30) అనే వ్యక్తి తాను స్పెషల్‌ సెల్‌ అధికారిని అని.. విమానంలో టెర్రరిస్ట్‌ ఉన్నాడంటూ హల్‌చల్‌ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. ఇక డబోలిమ్‌ విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడిని సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. విచారణలో జియా ఉల్‌ హక్‌కి మతి స్థిమితం సరిగా లేదని తెలిసింది. అతడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని పనాజీలోని మానసిక వ్యాధుల చికిత్స కేంద్రంలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: కోయి గోలి నహీ చలేగా..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top