Isak Munda: అప్పుడు ఒక్క పూట తిండి దొరకలేదు.. ఇప్పుడు నెలకు 5 లక్షలు

 Odisha Labourer Is Earning Lakhs From His YouTube Channel - Sakshi

పేద యువకుడి జీవితాన్ని మార్చేసిన యూట్యూబ్‌

భువనేశ్వర్‌: పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు..కానీ పేదవాడిగా గానే పోతే మన తప్పు. అది అక్షరాల నిజం.. ఒక పూట తిండికి నోచుకుని ఓ గిరిజన యువకుడు ప్రస్తుతం యూట్యూబ్‌లో నెలకు రూ.5లక్షలు సంపాదిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. వివరాలు.. ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ముండా అనే యువకుడు ఒకప్పుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. కరోనా మహ్మరి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ వలన అతడు తన ఉపాధిని కోల్పోయాడు. దీంతో తన కుటంబం రోడ్డున పడింది. దీంతో ఏంచేయాలో తోచని పరిస్ధితిలో ఉన్న ముండా తన స్నేహితుడి ఫోన్‌లో యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్‌ కు సంబంధించిన వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో ఫుడ్ బ్లాగర్లను ప్రేరణగా తీసుకుని యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అయితే స్మార్ట్‌ఫోన్ కొనే స్థోమత లేదు. దీంతో ముండా స్మార్ట్‌ఫోన్ కొనడానికి రూ.3,000 అప్పుగా తీసుకున్నాడు. దీంతో తన మొదటి వీడియోలో తాను తీసుకునే ఆహారం కోసం చేశాడు. ఒక ప్లేట్ లో అన్నం, పచ్చి టమాటో, పచ్చిమిర్చి కలిపి తింటున్న వీడియో ను పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో నెటిజన్లు ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలా మొదలైన ముండా యూట్యూబ్‌ చానల్‌కు ప్రస్తుతం 7 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు అతడు నెలకు సూమారు 5 లక్షలు పైగా సంపాదిస్తున్నాడు.

ఈ విషయంపై యువకుడు మాట్లడూతూ నేను చేసే వీడియోల్లో నా ఇళ్లు , తమ గ్రామంలో ప్రజలు జీవనం కోసం వీడియోలు చేస్తాను అని చెప్పాడు. తన వీడియోలు వీక్షిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం వచ్చిన డబ్బులతో తన తల్లి దండ్రలుకు ఇల్లు కట్టానని తెలిపాడు. తన ఏకైక లక్ష్యం యూట్యూబ్ వీడియోల నుంచి డబ్బు సంపాదించడం కాదు .. తమ స్థానిక సంప్రదాయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలనుకుంటున్నా అని ముండా అన్నాడు. ప్రస్తుతం ముండా వీడియోలు సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతున్నాయి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top