సర్పంచ్‌ అంటే అట్లుండాలి! ‍‍తొలిసారిగా నగదు డెలివరీ చేసే డ్రోన్‌!

Odisa Sarpanch Use Drone To Delivers Pension For Disabled Man - Sakshi

ఇంకా చాలా మూరుమూల ప్రాంతాల్లోని వారు రాష్ట్ర పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అందుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ దివ్యాంగుల పరిస్థితి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అలానే ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగుడి కోసం స్వయంగా ‍డ్రోన్‌ కొనుగోలు చేసి మరీ పెన్షన్‌ అందించి.. తన గొప్ప మనుసును చాటుకుంది ఓ మహిళా సర్పంచ్‌.

వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామంలో హెతారం సత్నామీ అనే శారీరక వికలాంగుడు నివశిస్తున్నాడు. ప్రభుత్వ ఫించను కోసం ప్రతి నెల దట్టమైన అడవి గుండా రెండు కి.మీ పైగా దూరంలో ఉన్న పంచాయతీ వద్దకు వచ్చేందుకు నానాతంటాలు పడుతున్నాడు. ఈసారి సర్పంచ్‌ చొరవతో అతను ఫించన్‌ను నేరుగా ఇంటి వద్ద తీసుకున్నాడు. ఆ గ్రామ సర్పంచ్‌ సరోజ్‌ అగర్వాల​ దివ్యాంగుడు సత్నామీ పరిస్థితితి గురించి తెలుసుకుని అతని సమస్యను పరష్కరించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆన్‌లైన్‌లో డ్రోన్‌ని కొనుగోలు చేశారు అగర్వాల్‌.

ఈ మేరకు సర్పంచ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ..సత్నామీ పుట్టుకతోనే వికలాంగు, కదలలేడు. దీంతో అతని పేరును రాష్ట్ర ఫించన్‌ పథకంలో నమోదు చేశాం. ఐతే ఫించన్‌ కోసం ఆ అడవిని దాటి పంచాయతీ వద్దకు రావడానికి చాల కష్టపడుతున్నాడు. ఇతర దేశాలలో డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుని వెంటనే కొనుగోలు చేసి అతడికి ఫించన్‌ పంపేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నా. ఐతే సదరు వ్యక్తికి విజయవంతంగా డ్రోన్‌ సాయంతో డబ్బు డెలివరీ చేయగలిగాం అని సర్పంచ్‌ చెప్పుకొచ్చారు.

డ్రోన్‌లను కొనుగోలు చేసే సదుపాయం ప్రభుత్వం వద్ద లేనందును సర్పంచే స్వయంగా కొనుగోలు చేయడంతో ఇది సాధ్యమైందని నువాపాడా బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సుబదార్‌ ప్రధాన్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందులు, కిరాణ సామాగ్రి, ఆహారం, ఇతర వస్తువులను డ్రోన్‌ల సాయంతో డెలివరీ చేయండ చూశాం. గానీ ఇలా డ్రోన్‌తో నగదు డెలవరీ చేయండం భారత్‌లోనే ప్రపథమం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?.. నా నుంచి అది మాత్రం లాక్కోలేరు: ఉద్దవ్‌ థాక్రే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top