Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్‌ టవర్స్‌ .. 9 సెకన్లలోనే..

Noida Supertech Twin Towers Demolition Done, Know More Details Inside - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఒక్క బటన్‌ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 9 సెకండ్లలోనే పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు.

ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు ముందుగానే స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్‌ ఇంప్లోజన్‌ ’’ (వాటర్‌ఫాల్‌ ఇంప్లోజిన్‌) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేశారు. ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చైతే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. అదే విధంగా ఆ దారిలో వచ్చే వాహనాలను మళ్లించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top