తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు కోసం అప్పటిదాకా ఆగాల్సిందే!: కేంద్రం

No increase in AP Telangana assembly seats till 2026 Says Centre - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం సమాధానం ఇచ్చింది.

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం బుధవారం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే.. రాజ్యాంగ సవరణ అవసరం. అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 15కు లోబడి.. ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం ఇచ్చారు.  

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్రం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు.

చదవండి: 12వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top