హైదరాబాద్‌ ఎన్‌ఐఏబీ ఇక సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబొరేటరీ

NIAB Hyderabad notified as central drugs lab for testing - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)ని సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబొరేటరీగా అప్‌గ్రేడ్‌ చేసి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం ఈమేరకు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏబీతో పాటు, పుణేలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్సెస్‌ సంస్థను కూడా అప్‌గ్రేడ్‌ చేసి సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబొరేటరీగా నోటిఫై చేసినట్లు శనివారం వెల్లడించింది. కోవిడ్‌–19 వ్యాక్సిన్లను త్వరితగతిన పరీక్షించి ధ్రువీకరణ ఇచ్చి కోవిడ్‌ మహమ్మారి నివారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని తెలిపింది. ప్రతి నెలా 60 బ్యాచ్‌ల వ్యాక్సిన్లను పరీక్షించే సామర్థ్యం ఈ ల్యాబ్‌లకు ఉన్నట్టు తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top