ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వైరల్‌ వీడియో

Netizens praise Tamil Nadu cop for his duty amid heavy rains - Sakshi

సాక్షి, చెన్నై: భారీ వర్షంలో కూడా డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా  రెయిన్‌ కోటుధరించి మరీ విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ని ప్రశంసిస్తూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 13 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతేకాదు హోరు వానలో బిజీ రోడ్డులో అత్యంత అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించాయితూత్తుకుడి ఎస్‌పీ జయకుమార్ ముత్తురాజాను అభినందిం చడంతోపాటు,  అతనికి బహుమతి కూడా ప్రకటించారు.

రియల్‌ హీరో, అభినందనలు అంటూ చాలామంది ముత్తురాజాను అభినందిస్తున్నారు. మరోవైపు కష్టపడి పనిచేసే ప్రభుత్వోద్యోగులందరూ గర్వకారణమే! కానీ ట్రాఫిక్‌ పోలీసులు సురక్షిత పరిస్థితులో పనిచేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు! ఎవరు పట్టించుకుంటారు!! అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top