NEET-UG 2024: నీట్‌పై నేడు సుప్రీంలో విచారణ | NEET-UG 2024: SC to hear batch of pleas related to irregularities in exam on 8 july 2024 | Sakshi
Sakshi News home page

NEET-UG 2024: నీట్‌పై నేడు సుప్రీంలో విచారణ

Jul 8 2024 5:22 AM | Updated on Jul 8 2024 5:22 AM

NEET-UG 2024: SC to hear batch of pleas related to irregularities in exam on 8 july 2024

న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నీట్‌–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం నుంచి విచారణ మొదలుకానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్‌కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలు విననుంది. 

అయితే, పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని, పేపర్‌ లీకేజీ భారీపెద్ద ఎత్తున జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పేపర్‌ లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement