పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ..? | Sakshi
Sakshi News home page

పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ..?

Published Thu, Jul 15 2021 2:10 PM

నవజోత్ సింగ్ సిద్దూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నియమించబడవచ్చు - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్రంలో  త్వరలో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో అంతర్గిత కుమ్మలాటపై కాంగ్రెస్‌ హైకమండ్‌ దృష్టి సారించింది. సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌, న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మ‌ధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెర‌పైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.అయితే  దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుత పంజాబ్ పీసీసీ చీఫ్‌ సునీల్ జక్కర్ స్థానంలో సిద్దూను నియమించనున్నారు. మరో ఇద్దరు సీనియర్ నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉంది. పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ హరీశ్ రావత్ బుధవారం  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిద్దుకు పంజాబ్ పార్టీ బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిద్దుకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement