మార్చి 12న జాతీయ లోక్‌ అదాలత్‌

National Lok Adalat Schedule For The Year 2022 - Sakshi

ప్రజలకు తెలియజేయాలని కొత్వాల్‌ ఆదేశం

వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్న డీసీపీలు 

సాక్షి, హైదరాబాద్‌: కేసుల రాజీకి సంబంధించిన జాతీయ లోక్‌ అదాలత్‌ మార్చి 12న జరగనుంది. దీనికి సంబంధించి న్యాయ విభాగం నుంచి నగర పోలీసులకు సమాచారం అందింది. ప్రజలకు ఉపయుక్తమైన లోక్‌ అదాలత్‌పై అందరికీ అవగాహన కల్పించాలని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. వీలున్నంత వరకు అత్యధికులు దీన్ని వినియోగించుకుని, ఫలితాలు పొందేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను జోనల్‌ డీసీపీలకు అప్పగించారు. 

దీంతో ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా ఉన్న సంయుక్త పోలీసు కమిషనర్‌ ఎం.రమేష్‌ రెడ్డి బుధవారం తన పరిధిలోని అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ భారీ లోక్‌ అదాలత్‌కు సంబంధించిన సమాచారం సంబంధిత వ్యక్తులకు అందించే బాధ్యతలను ఇన్‌స్పెక్టర్లు, సబ్‌– ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం ద్వారా లోక్‌ అదాలత్‌తో పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని రమేష్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. (క్లిక్: హైదరాబాద్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ఎండ్‌కార్డ్‌.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top