సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిలుపు
న్యూఢిల్లీ: దేశ రక్షణలో సాయుధ బలగాల పాత్ర శ్లాఘనీయమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వారికి మెరుగైన న్యాయసౌలభ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం సరిహద్దుల్లో ఒక యుద్ధం, న్యాయపరమైన హక్కుల కోసం మరో యుద్ధం, ఇలా రెండు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులను వారికి రానివ్వరాదన్నారు.
లేహ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. కోర్టులు న్యాయవ్యవస్థ, రాజ్యాంగ విలువలకు రక్షణ కల్పిస్తుండగా, సాయుధ బలగాలు అందుకు అవసరమైన ఆదర్శాలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయని ఆయన తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, గౌరవం, సమానత్వం, న్యాయం దేశ ప్రజలకు అందించేందుకు తగిన రక్షణను, పరిస్థితులను కల్పించిన ఘనత సైనికులకే దక్కుతుందన్నారు.


