మహాత్మునికి మోదీ నివాళి

సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగానూ విజయ్‌ఘాట్ వద్ద ప్రధాని నివాళి అర్పించి.. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు గాంధీకి నివాళి అర్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగానూ మహాత్ముని జయంతి వేడుకలు ఘనంగా జరుతున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి