జిప్‌లైన్‌ కేబుల్‌ తెగి 30 అడుగుల లోతులో కిందపడ్డ త్రిష..వీడియో వైరల్‌ | Nagpur girl critically injured as zipline belt breaks mid-air in Manali | Sakshi
Sakshi News home page

జిప్‌లైన్‌ కేబుల్‌ తెగి 30 అడుగుల లోతులో కిందపడ్డ త్రిష..వీడియో వైరల్‌

Jun 15 2025 9:19 PM | Updated on Jun 15 2025 9:19 PM

Nagpur girl critically injured as zipline belt breaks mid-air in Manali

ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం విషాదం నెలకొంది. మనాలి అందాలను వీక్షించేందుకు జిప్‌లైన్‌ కేబుల్‌ ద్వారా వెళ్తున్న సమయంలో 10ఏళ్ల బాలిక 30 అడుగుల లోతులో పడింది. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.

జూన్ 8న  నాగపూర్‌కు చెందిన ప్రపుల్లా బిజ్వే, అతని భార్య,కుమార్తె త్రిషా బిజ్వే కుటుంబం మనాలిలో ప్రకృతి అందాల్ని వీక్షించేందుకు  వెళ్లింది. జూన్‌8న జిప్‌లైన్‌ కేబుల్‌ ద్వారా అటు వైపు నుంచి ఇటువైపుకు వచ్చే సమయంలో త్రిషా బిజ్వే మధ్యలోకి వచ్చిన తర్వాత  అకస్మాత్తుగా కిందకు పడిపోయింది. జిప్‌లైన్‌ ఊడిపోయి 30 అడుగుల లోతులో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.  

బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం, అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి సహయక చర్యలు అందలేదని తెలిపారు. త్రిషకు మనాలీలో ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం చండీగఢ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నాగ్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

బిజ్వే కుటుంబం ఆ ప్రమాదం జరిగిన దృశ్యాలను మీడియాకు వెల్లడించారు. ఆ వీడియోలో జిప్‌లైన్ హార్నెస్ ఒక్కసారిగా తెగిన దృశ్యం కనిపిస్తుంది. ఈ దుర్ఘటనలో నిర్లక్క్ష్యం వహించిన జిప్‌లైన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి అడ్వెంచర్ టూరిజం సెంటర్లలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement