breaking news
rever
-
జిప్‌లైన్ కేబుల్ తెగి 30 అడుగుల లోతులో కిందపడ్డ త్రిష..వీడియో వైరల్
ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం విషాదం నెలకొంది. మనాలి అందాలను వీక్షించేందుకు జిప్‌లైన్ కేబుల్ ద్వారా వెళ్తున్న సమయంలో 10ఏళ్ల బాలిక 30 అడుగుల లోతులో పడింది. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.జూన్ 8న నాగపూర్‌కు చెందిన ప్రపుల్లా బిజ్వే, అతని భార్య,కుమార్తె త్రిషా బిజ్వే కుటుంబం మనాలిలో ప్రకృతి అందాల్ని వీక్షించేందుకు వెళ్లింది. జూన్8న జిప్‌లైన్ కేబుల్ ద్వారా అటు వైపు నుంచి ఇటువైపుకు వచ్చే సమయంలో త్రిషా బిజ్వే మధ్యలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా కిందకు పడిపోయింది. జిప్‌లైన్ ఊడిపోయి 30 అడుగుల లోతులో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం, అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి సహయక చర్యలు అందలేదని తెలిపారు. త్రిషకు మనాలీలో ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం చండీగఢ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నాగ్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.బిజ్వే కుటుంబం ఆ ప్రమాదం జరిగిన దృశ్యాలను మీడియాకు వెల్లడించారు. ఆ వీడియోలో జిప్‌లైన్ హార్నెస్ ఒక్కసారిగా తెగిన దృశ్యం కనిపిస్తుంది. ఈ దుర్ఘటనలో నిర్లక్క్ష్యం వహించిన జిప్‌లైన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి అడ్వెంచర్ టూరిజం సెంటర్లలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.A 12-year-old girl from Maharashtra's Nagpur suffered severe injuries after she plunged 30 feet during a zipline ride in Manali, Himachal Pradesh.Trisha Bijwe fell while riding a zipline after the rope connected to her harness snapped. pic.twitter.com/P1QwnFyrQZ— The Siasat Daily (@TheSiasatDaily) June 15, 2025 -
తాండవ నదిలో ఇసుక కార్మికుడి మృతి
తుని రూరల్ : తుని మండలం మరువాడ వద్ద శుక్రవారం తాండవ నదిలో ఇసుక తవ్వకానికి దిగిన కార్మికుడు ప్రమాదవశాస్తు నీట మునిగి మృతి చెందాడు. సహచరుల కథనం మేరకు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కురందాసు నాని (చెల్లారావు–32) రోజులాగే తాండవ నదిలో ఇసుక తీసేందుకు వెళ్లాడు. నదీలో పది అడుగుల నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో ఇసుక తీయడం చేపట్టాడు. కొద్దిసేపటికే నీటి మునిగిపోతూ రక్షించండి అంటు కేకలు వేశాడు. సమీపంలోనే ఉన్న సహచరులు వచ్చి ప్రయత్నించినా కనిపించకపోవడంతో గల్లంతైనట్టుగా తుని అగ్నిమాపక, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల అనంతరం నాని మృతదేహాం లభ్యమైంది. కేసు నమోదు చేసి తుని ఏరియా ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులు బందువులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. ప్రమాదమని తెలిసినా ఉపాధి కోసం తాండవ నదీలో దిగి ఇసుక తవ్వకాలు చేస్తున్నామని పి.కృష్ణ, ఉరుకూటి రాము తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
రక్షించిన స్థానికులు పోలీసులకు అప్పగింత రాజమహేంద్రవరం క్రైం: భర్త వేధింపులను తాళలేని ఒక మహిళ తన కుమార్తెతో పాటు ఆత్మహత్యా యత్నం చేసుకుంది. అది గమనించిన స్థానికులు ఆ మహిళను, ఆమె పాపను రక్షించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. క్వారీ మార్కెట్ సెంటర్‌కు చెందిన ఎం. శ్రావణి అదే ప్రాంతానికి చెందిన రాజేష్‌ను వివాహం చేసుకుంది. రాజేష్ తరచూ మద్యం సేవించి వచ్చి అనుమానంతో భార్యను కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అతనిపై శ్రావణి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వారు రాజేష్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికి అతనిలో మార్పు రాలేదు. దాంతో విరక్తి చెందిన శ్రావణి శుక్రవారం ఉదయం కోటిలింగాల ఘాట్ వద్ద సంవత్సరం వయస్సుగల కుమార్తెతో గోదావరి నదిలోకి దిగి ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నిస్తుండగా స్థానికులు గమనించి ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. త్రీటౌన్ సీఐ శ్రీ రామ కోటేశ్వరరావు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం : తండ్రి మందలించాడని మనస్ధాపంతో గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవిచౌక్‌కు చెందిన కందగడ్డల సాయి మణికంఠ పుల్లేశ్వరరావు(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మణికంఠ తండ్రి బ్రహ్మజీ రావు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల పుల్లేశ్వరరావు అక్కకు వివాహం చేశారు. అయితే మంగళవారం వివాహానికి అయిన ఖర్చుల విషయంలో తల్లి దండ్రుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన తండ్రి బ్రహ్మాజీరావు కుమారుడు మణికంఠ పుల్లేశ్వరరావును ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. దీంతో మనస్ధాపానికి గురైన పుల్లేశ్వరరావు మంగళవారం మ«ధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి తల్లికి ఫోన్ చేసి తాను గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు. కొడుకు తమను భయ పెట్టడానికి చెబుతున్నాడని అనుకున్న తల్లిదండ్రులు ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాత్రికి ఇంటికి చేరకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే బ్రిడ్జి పైకి వెళ్ళిచూడగా మణికంఠ వేసుకువెళ్ళిన మోటారు సైకిల్, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. బుధవారం మృతదేహం కోసం గాలించగా సాయంత్రానికి లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో శోక సముద్రంలో కుటుంబం... ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఐదు రోజుల క్రితం కుమార్తె పెళ్ళి చేసిన ఆ కుటుంబంలో అనుకోని సంఘటనతో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నిరుమున్నీరుగా విలపించడం స్ధానికులను కంటతడి పెట్టించింది.