శీతాకాలమా....వర్షాకాలమా?

Mumbai Rains Trending On Twitter  - Sakshi

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై, థానే పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం తేలికపాటి జల్లులు ​కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, వేడి నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా ఈ నెల 13 వరకు ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇలా డిసెంబర్‌లో అకాలవర్షం కురవడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో వాన కురిసిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ఆకాశం మేఘావృతమైన, వర్షంతో తడిసిన వీధులను ఉద్దేశించి నెటిజన్లు మీమ్స్‌ షేర్‌ చేస్తూ, జోకులు పేలుస్తున్నారు.  ఉదయం వర్షం పడటంతో, ఆ  శబ్దం ఏంటో అర్ధం కాలేదని కొంతమంది చమత్కరించగా... మరికొంత మంది.. ‘‘ఇది శీతాకాలం. ఇది డిసెంబర్‌ అయినా వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఇది 2020. కాబట్టి ఏదైనా సా‍ధ్యం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది.. ‘‘వర్షం , చలి, వేడి, కరోనా , తుఫాన్‌ ఇవన్నీ కలిపి డిసెంబర్‌ నెలగా దేవుడు నిర్ణయించాడు’’ అని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఫొటోలు షేర్‌ చేస్తున్నారు.

ట్విటర్‌‌లో వైరల్‌ అవుతున్న మీమ్స్‌ :

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top