50 రూపాయలకే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ | MRI scan for Rs 50 only in delhi gurudwara | Sakshi
Sakshi News home page

50 రూపాయలకే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌

Oct 4 2020 4:49 AM | Updated on Oct 4 2020 4:49 AM

MRI scan for Rs 50 only in delhi gurudwara - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత తక్కువగా ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ను కేవలం రూ. 50 కే అందించనున్నట్లు ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ చెప్పింది. గురుద్వారా ప్రాంగణంలోనే ఉన్న గురు హరిక్రిషన్‌ ఆస్పత్రిలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ మొదటి వారంలో ఆయా సేవలు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్‌ ను కేవలం రూ. 600కే అందిస్తామని కమిటీ అధ్యక్షుడు మన్జిందర్‌ సింగ్‌ చెప్పారు. పేదలకు ఎమ్‌ఆర్‌ఐ కేవలం రూ. 50కే అందిస్తామని తెలిపారు. ప్రైవేటు ల్యాబుల్లో ఎమ్‌ఆర్‌ఐ రూ. 2,500 వరకూ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement