
ముంబై: దేశంలో నిన్న(ఆగస్టు 27)న మొదలైన గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పిల్లాపెద్దా అంతా కలిసి వినాయక మండపాలలో సందడి చేస్తున్నారు. పలుచోట్ల ఉత్సవ కమిటీలు పోటీలు పడీ భారీ విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేశాయి. ఈ ఉత్సవాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఏడు అత్యంత భారీ గణపతులను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తుంటారు. అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో రెండు ప్రముఖ గణపతులు తెలంగాణకు చెందినవే కావడం విశేషం.
1. లాల్‌బాగ్చా రాజా, లాల్‌బాగ్, ముంబై
‘ముంబై రాజు’గా పేరొందిన లాల్‌బాగ్చా రాజా గణపతి మండపాన్ని బ్రిటిష్ పాలకుల కాలంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. 85 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో ఈ గణపతి మండపం ఉంది. నేత కార్మికులకు నిలయమైన ఈ ప్రాంతంలో కొలువైన ఈ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 10 రోజుల గణపతి ఉత్సవాల్లో లాల్‌బాగ్చా రాజాను ప్రతిరోజూ సగటున 15 లక్షల మంది సందర్శిస్తుంటారు.
2. దగ్డుషేత్ హల్వాయి, పూణే
భారతదేశంలో అత్యంత ఖరీదైన గణేశ్ మండపాల్లో దగ్డుషేత్ హల్వాయి గణపతి ఒకటి. ఇక్కడ గణేశోత్సవం 1896 నుండి జరుపుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక మిఠాయి వ్యాపారి ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించారని చెబుతారు. దేశంలోనే అత్యంత ఖరీదైన గణపతి ప్రతిమను ఇక్కడ నెలకొల్పుతారు. ఈ ప్రతిమకు భీమా కవరేజ్ కోటి రూపాయలకు చేరుకుంది.
3. ఖైరతాబాద్ గణేశుడు, హైదరాబాద్
హైదరాబాద్(తెలంగాణ)లోని ఖైరతాబాద్ గణేశుడు..అత్యంత ఎత్తయిన గణనాథునిగా పేరొందాడు. ప్రతి సంవత్సరం విభిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని రూపొందిస్తుంటారు. నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు ఖరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకుంటారు.
4. జీఎస్‌బీ సేవా మండల్, ముంబై
ముంబైలోని కింగ్ సర్కిల్‌లో జీఎస్‌బీ సేవా మండల్ 60 కిలోలకు పైగా బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని మండపంలో అలంకరిస్తుంది. ఈ గణేశుని విగ్రహం పర్యావరణ అనుకూలమైనదని చెబుతుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సంప్రదాయ దుస్తులు ధరించి రావాలనే నిబంధన ఉంది. ఈ గణపతికి ఐదు రోజులు మాత్రమే వేడుకలు జరుగుతాయి.
5. బాలాపూర్ గణేశుడు, హైదరాబాద్
హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ మండపం ఎంతో పేరొందింది. లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తుంటారు.
6. చించ్‌పోక్లి చ రాజా, ముంబై
చింతామణి గణపతి లేదా చించ్‌పోక్లి చ రాజా గా పేరొందిన ఈ గణపతి మండపం ముంబైలో ఎంతో పేరొందింది. ఇక్కడికి వచ్చే భక్తులు గణేశునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాల్లో వచ్చిన ధనాన్ని నిర్వాహకులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు.