చిన్నారుల డ్యాన్స్‌ను ఎంజాయ్ చేసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

దిస్పూర్: ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. గడిచిన 8 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు మెరుగుపడినట్లు ఆయన తెలిపారు.
అస్సాంలోని దింఫలో గురువారం జరిగిన ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలుతో ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు 75% తగ్గుముఖం పట్టాయని ప్రధాని అన్నారు. వివిధ సాయుధ గ్రూపులతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని త్రిపుర, మేఘాలయాల్లో ఏఎఫ్‌ఎస్‌పీను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం నాగాలాండ్, మణిపూర్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయని వెల్లడించారు. కర్బి ఆంగ్‌లాంగ్, ఇతర గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని ప్రధాని తెలిపారు.
దీంతోపాటు, ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామన్నారు. అస్సాం, మేఘాలయ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని, అభివృద్ధి బాటన పయనించేందుకు సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కర్బిఆంగ్‌లాంగ్‌లో వెటరినరీ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కళాశాల, మోడల్ కాలేజీ నిర్మాణం తదితర రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
#WATCH | PM Narendra Modi witnesses traditional folk dance at the Khanikar ground in Dibrugarh, Assam
PM Modi will soon dedicate six more cancer hospitals to the nation and lay the foundation stones of seven new cancer hospitals in Assam. pic.twitter.com/x9kIx5vpxq
— ANI (@ANI) April 28, 2022